26 మంది ఎమ్మెల్యేలతో హరీశ్ రావు కాంగ్రెస్‌లోకి వస్తే ఆ మంత్రి పదవి ఇస్తాం: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
- హరీశ్ రావు కాంగ్రెస్‌లో చేరితే దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామని వ్యాఖ్య
- హరీశ్ రావు ది రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటూ కితాబు
- హరీశ్ రావుకు బీఆర్ఎస్‌లో భవిష్యత్తు లేదని వ్యాఖ్య
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కేబినెట్‌లోకి తీసుకొని దేవాదాయ శాఖను అప్పగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ది రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. శాసన సభ లాబీలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రజలు ఎవరూ అంత తొందరగా బీఆర్ఎస్‌ను నమ్మరన్నారు.
హరీశ్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లో చేరితే ఆయనకు దేవాదాయశాఖ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీశ్ రావుకు దేవాదాయ శాఖ మంచి అవకాశమన్నారు. హరీశ్ రావు కష్టజీవి... కానీ ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్లు తీసుకోలేదా? ఇప్పుడు కూడా హరీశ్ రావు వన్ థర్డ్ అంటే ఒకేసారి 26 మంది ఎమ్మెల్యేలతో తమ పార్టీలోకి రావాలన్నారు.