హాట్ స్టార్ ట్రాక్ పైకి 'నా సామిరంగ'
- జనవరి 14న విడుదలైన 'నా సామిరంగ'
- సక్సెస్ టాక్ తెచ్చుకున్న సినిమా
- ఆషిక గ్లామర్ ఈ సినిమాకి హైలైట్
- ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్
నాగార్జున కథానాయకుడిగా 'నా సామిరంగ' సినిమా రూపొందింది. కొరియాగ్రఫర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ బిన్ని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. పండుగకి సంబంధించిన కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లను రాబట్టింది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆషిక రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాతో విలన్ గా షబ్బీర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. అక్కడి సందళ్లు .. సంబరాలతో పాటు, రౌడీయిజాలు .. రాజకీయాలు కూడా ఈ కథలో కనిపిస్తాయి. కామెడీ టచ్ తో కూడిన రొమాన్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. కీరవాణి సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.