చంద్రబాబు రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్ భావించారు... అందుకే జగన్‌కు సహకరించారు: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • కేసీఆర్‌కు, చంద్రబాబుకు రాజకీయంగా పడదన్న మంత్రి జూపల్లి   
  • ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీత
  • నీటి సమస్యలు పరిష్కరించనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సహకరించారు? అని ప్రశ్న
చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదని కేసీఆర్ భావించారని... అందుకే  ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. కేసీఆర్‌కు చంద్రబాబుకు రాజకీయంగా పడదు... కాబట్టి టీడీపీ అధినేత రెండోసారి సీఎం కావొద్దని భావించారన్నారు. అసలు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. 

నీటి సమస్యలు పరిష్కరించనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సహకరించారు? అని అడిగారు. కేంద్రం వద్ద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోకరిల్లిందని ఆరోపించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయమైన తెలంగాణ వాటాను సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదని హరీశ్ రావు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో వేలకోట్ల రూపాయిల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందుకు ఆధారాలు చూపించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతిచ్చారని మండిపడ్డారు.


More Telugu News