మనం ఒకరిపై ఒకరం రాళ్లు వేసుకోవద్దు: హరీశ్ శంకర్
- మొన్న ఫ్రైడే విడుదలైన 'ఈగల్'
- యాక్షన్ పాళ్లు ఎక్కువయ్యాయనే టాక్
- సక్సెస్ మీట్ లో అసహనాన్ని వ్యక్తం చేసిన హరీశ్ శంకర్
- 'ఈగల్' లవ్ స్టోరీ కాదని కౌంటర్
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'ఈగల్' సినిమా మొన్న శుక్రవారం రోజున థియేటర్లకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ సినిమాలో, కావ్య థాఫర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువైపోయాయనే టాక్ వచ్చింది. అలాగే లవ్ ట్రాక్ ను ఇంకాస్త బాగా చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
ఈ వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతున్నారు. లవ్ ట్రాక్ ను ఎక్కువగా చూపించడానికి ఇక్కడ తీసింది 'ప్రేమపావురాలు' .. 'ప్రేమ పంజరం' లాంటి సినిమా కాదు. గెడ్డం పెంచుకుని హీరో కాల్చుకుంటూ వెళుతుంటే, లవ్ స్టోరీ గురించి మాట్లాడటం ఏంటి?" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. మొన్న సురేశ్ కొండేటి గారి గురించి నేను ఒక మాట అంటే, నన్ను అభినందిస్తూ చాలామంది కామెంట్స్ పెట్టారు. నా పై అంత ప్రేమను చూపించడానికి కారణం, అతనిపై ఉన్న కోపమే అని నాకు అర్థమైంది" అని అన్నారు.
అందరికీ తాను ఒక విషయం చెప్పదలచుకుంటున్నాననీ, ఇండస్ట్రీ అంటే దర్శక నిర్మాతలు .. ఆర్టిస్టులు మాత్రమే కాదు, జర్నలిస్టులు కూడా. మనమంతా ఒకటి .. మనం ఒకరిపై ఒకళ్లం రాళ్లు వేసుకోవడం మంచిది కాదు. మేమంతా ఒక గట్టున .. మీరంతా ఒక గట్టున లేము. అందరం కలిసి ఉన్నది ఇండస్ట్రీలోనే. కార్తీక్ ఘట్టమనేని ట్రావెలింగ్ .. టాలెంట్ నాకు తెలుసు. అందువలన నాకు బాధ అనిపించి ఈ సినిమాను గురించి మాట్లాడుతున్నాను" అని చెప్పాడు.