అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన వ్యక్తి చంద్రబాబు: జస్టిస్ గోపాలగౌడ

  • చంద్రబాబుపై పుస్తకం రచించిన జర్నలిస్టు విక్రమ్
  • విజయవాడలో నేడు 'మహా స్వాప్నికుడు' పుస్తకావిష్కరణ
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ
  • రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రత్యేకస్థానముందని కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గోపాలగౌడ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు కార్మిక, మహిళా శ్రేయోభిలాషి అని కొనియాడారు. నాడు అబ్దుల్  కలాంను రాష్ట్రపతి చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానమంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుది అని వివరించారు. జీఎంసీ బాలయోగి వంటి దళిత నేతను స్పీకర్ గా చేశారని వెల్లడించారు. 

చంద్రబాబుపై సీనియర్ జర్నలిస్టు పి.విక్రమ్ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకావిష్కరణ నేడు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ గోపాలగౌడ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రంగంలో చంద్రబాబుకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. చంద్రబాబు మానవతావాది, సమాజవాది అని కొనియాడారు.


More Telugu News