పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్
- ఢిల్లీలో అమిత్ షాను కలిసి వచ్చిన చంద్రబాబు
- ఢిల్లీ వెళ్లాలని భావించిన పవన్ కల్యాణ్
- అయితే, ముందు చంద్రబాబుతో భేటీ అవ్వాలని తాజాగా నిర్ణయం!
ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఏపీలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, స్థానాల ఖరారు, సీట్ల సర్దుబాటుపై ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసి వచ్చారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలవాలని అనుకున్నారు.
అయితే, పవన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన ఢిల్లీ వెళ్లడానికి ముందు చంద్రబాబును కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆయన విజయవాడ బయల్దేరనున్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు ఉన్నప్పటికీ, ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. జనసేనతో తాము కలిసే ఉన్నామని బీజేపీ చెబుతున్నప్పటికీ, రేపటి ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.