అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్లో ఆసీస్ పై టాస్ ఓడిన భారత్

  • దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
  • నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్
  • బెనోనీలోని విల్లోమోర్ పార్క్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
అండర్-19 వరల్డ్ కప్ లో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలోని బెనోనీ నగరం ఈ టైటిల్ పోరుకు ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ఓపెనర్ హ్యారీ డిక్సన్ 20, కెప్టెన్ హ్యూ వీబ్జెన్ 12 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబానీ ఒక వికెట్ తీశాడు. లింబానీ ఆసీస్ ఓపెనర్ శామ్ కోన్ స్టాస్ ను డకౌట్ చేశాడు. 

ఇటీవల భారత గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలోనే ఓటమిపాలైంది. ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో నెగ్గడం ద్వారా భారత కుర్రాళ్ల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


More Telugu News