నదిలో జాలర్లకు దొరికిన 100 కిలోల స్ఫటిక లింగం

  • గుజరాత్‌లోని భారూచ్‌ జిల్లా కావీ గ్రామం నదీ తీరంలో ఘటన
  • చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు చిక్కిన భారీ శివలింగం
  • స్థానిక శివాలయంలో ప్రతిష్ఠించే యోచనలో స్థానికులు
నదిలో చేపల వేటకు వెళ్లిన గుజరాత్‌ జాలర్లకు 100 కిలోల బరువున్న భారీ శివలింగం లభించింది. బుధవారం భారుచ్ జిల్లాలోని కావీ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. 

తొలుత వలకు ఏదో బరువైనది చిక్కిందని భావించిన జాలర్లు శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 100 కిలోల బరువున్నప్పటికీ జాగ్రత్తగా దాన్ని పడవమీదకు చేర్చి తీరానికి తరలించారు. శివలింగం మీద పామును చెక్కినట్టు బయటపడింది. విషయం తెలిసిన స్థానికులు శివలింగాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈలోపు జాలర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ శివలింగాన్ని స్థానిక కమలేశ్వర్ మహాదేవ్ గుడి లేదా సమీపంలోని ఇతర శివాలయంలో ప్రతిష్ఠించాలని స్థానికులు భావిస్తున్నారు. 



More Telugu News