మేళాలో దారుణం.. కార్లను ఢీకొన్న మిల్క్ ట్యాంకర్!

  • రాణీపూల్‌లో ఏర్పాటు చేసిన మేళాలో దారుణం
  • బ్రేకులు ఫెయిలవడంతో కార్లను ఢీకొట్టిన మిల్క్ ట్యాంకర్
  • ముగ్గురి మృతి, 20 మందికి గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
సిక్కింలోని రాణీపూల్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ మేళాలో ఉన్న కార్లను ఓ మిల్క్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాల కింద పడి ముగ్గురు మృతి చెందగా 20 మంది గాయాలపాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిల్క్ ట్యాంకర్ రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలిసింది.


More Telugu News