నీట్-2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
- మే 5న నీట్ (యూజీ)-2024 పరీక్ష
- మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
- ఫీజు వివరాలు ప్రకటించిన ఎన్టీయే
- జూన్ 14న నీట్ ఫలితాల విడుదల
జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది. నీట్ రాయాలనుకుంటున్న అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://neet.ntaonline.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
నీట్ (యూజీ)-2024 పరీక్ష రిజిస్ట్రేషన్లకు మార్చి 9వ తేదీ చివరి రోజు. దరఖాస్తుదారులు క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును మార్చి 9వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు.
జనరల్ కేటగిరీ, ఎన్నారై అభ్యర్థులు నీట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,700 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీల్ అభ్యర్థులు రూ.1,600... ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులో తప్పిదాల సవరణకు, హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు తేదీలను వెబ్ సైట్ ద్వారా త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే వెల్లడించింది.
ఈ ఏడాది నీట్ పరీక్ష మే 5న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. జూన్ 14న నీట్ ఫలితాలు వెల్లడించనున్నారు.