నారాయణ సహకారం టీడీపీకి ఉండకూడదనేదే జగన్ లక్ష్యం: ఎంఏ షరీఫ్
- మాజీ మంత్రి నారాయణ నివాసంలో నిన్న సోదాలు
- సోదాలు జరిపిన మాదక ద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు
- నారాయణ ఏమైనా స్మగ్లరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన షరీఫ్
- టీడీపీలో ఉండడమే నారాయణ చేసిన తప్పా? అంటూ నిలదీత
తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్పా? అని ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. నారాయణ నివాసంలో నిన్న మాదక ద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు జరిపిన సోదాలపై షరీఫ్ స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణ ఇంట్లో దాడులు అమానుషం అని ఖండించారు. నారాయణ సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదనేదే జగన్ లక్ష్యం అని ఎంఏ షరీఫ్ మండిపడ్డారు.
అంతమంది సిబ్బందితో దాడులు చేయడానికి నారాయణ ఏమైనా స్మగ్లరా?
నారాయణ ఇంట్లో దాడులు అమానుషం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ ఇంట్లో సోదాలు చేయడం అన్యాయం. వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ఠ. కోర్టు ఉత్తర్వులు లేకుండా ఐదుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, వంద మంది పోలీసులతో నారాయణ ఇంటిని సోదా చేయడం అక్రమం. ఆయన ఏమైనా స్మగ్లరా? వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని వాడుకుంటున్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి నారాయణ ఇంటి సోదాలే నిదర్శనం.
చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు నారాయణ
నిజాయతీ, నిబద్ధత కలిగిన వ్యక్తి నారాయణ. మంచి వ్యక్తులపైనా మీ దాడులు అని వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. నారాయణ దాదాపు 2 దశాబ్దాలుగా టీడీపీలో ఉండి చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. పార్టీ కేడర్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆయన పార్టీకి చాలా సహకరిస్తూ వస్తున్నారు. పార్టీ ప్రతిష్ఠకు కృషి చేస్తున్నారు.
మాజీ మంత్రి నారాయణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కక్ష తీరలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రతిపక్ష నేతలపై వేధింపులు కొనసాగిస్తూనే వుంది. మొదట నారాయణ విద్యా సంస్థలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టారు. ఆ తరువాత రాజధానిలో అక్రమంగా భూముల కొనుగోళ్లు అంటూ కేసులు పెట్టారు. ఇవేవీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు నారాయణ ఇంటిలోకి వెళ్లి సోదాలు జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు నారాయణ ఇంట్లో ఎలా సోదాలు జరుపుతారు? అధికారులు అక్రమంగా నారాయణ ఇంటిలోకి ఎలా వెళతారు?
జగన్ మాట వింటే అధికారులు బలవక తప్పదు
జగన్ రెడ్డి చెప్పినట్లు వింటే రాబోయే రోజుల్లో అధికారులు బలవక తప్పదు. నారాయణ ఏమైనా తీవ్రవాదా? ఆయన ఇంట్లో సోదాలు జరపాల్సిన అవసరమేంటి? ఇంట్లో అంత కష్టపడి సోదాలు జరిపారు. ఏం దొరికాయో తెలపాలి. నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నాడని ఆయనను ఇప్పటినుంచే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేక ఇప్పటి నుంచే ప్రతిపక్ష నేతల్ని బెదిరిస్తున్నారు.
అధికారం కోల్పోతున్నా జగన్ లో ఇంకా మార్పు లేదు
అధికారం కోల్పోతున్నా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నారాయణ భార్యని హౌస్ అరెస్టు చేశారు. నారాయణ ఇంటిలోని మంచాలను ధ్వంసం చేశారు. నారాయణ ఇంటిలో ఎటువంటి మాదకద్రవ్యాలు, ధనం లభించలేదు, అనవసరంగా దాడులు జరపడం ఎంతవరకు సబబు?
2014 నుండి నెల్లురును అభివృద్ధి చేసినవ్యక్తి నారాయణ
2014నుండి 2019 వరకు నెల్లూరు పట్టణాన్ని నారాయణ అభివృద్ధి చేశారు. నారాయణ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి వందలాది కోట్లు ఖర్చు చేశారు. నెల్లూరు స్వరూపాన్నే మార్చేశారు. నారాయణను ఎందుకు ఓడించామా? అని నెల్లూరు వాసులు పశ్చాత్తాపం పొందతుతున్నారు. ఇప్పుడు ఆయనను గెలిపించడానికి నెల్లూరు జిల్లా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అందరూ ఈసారి నారాయణ గెలవాలి అని అనుకుంటున్నారు... అంటూ ఎంఏ షరీఫ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.