తెలంగాణ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..!

  • అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం
  • ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యమిచ్చిన రేవంత్ సర్కారు
  • గత ప్రభుత్వ బడ్జెట్ వాస్తవ దూరంగా ఉందని భట్టి విమర్శలు
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు. 

అయితే, ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో రూ.17,700 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం.. వాస్తవంలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. 

కేటాయింపులు ఇలా..
ఆరు గ్యారెంటీల అమలు రూ.53,196 కోట్లు
ఐటీ శాఖ రూ.774 కోట్లు 
పంచాయతీరాజ్‌ శాఖ రూ.40080 కోట్లు
పురపాలక శాఖ రూ.11,692 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.19,746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాలు రూ.1250 కోట్లు
గృహ నిర్మాణం రూ.7740 కోట్లు
నీటి పారుదల శాఖ రూ.28024 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 8,000 కోట్లు.


More Telugu News