మూడు టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కోహ్లీ, అయ్యర్ ఔట్

  • వ్యక్తిగత కారణలతో కోహ్లీ, గాయాల కారణంగా అయ్యర్ దూరం
  • షరతులతో జడేజా, కేఎల్ రాహుల్ ఎంపిక
  • మెడికల్ క్లియరెన్స్ వస్తేనే వీరికి తుది జట్టులో చోటు
ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై ఇండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగిశాయి. చివరి మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు దూరమయ్యారు. మూడు టెస్టులకు అందుబాటులో ఉండనని కోహ్లీ తెలిపిన నేపథ్యంలో ఆయనను జట్టులోకి తీసుకోలేదు. 

ఇండియా టెస్ట్ స్క్వాడ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేశ్ కుమార్, ఆకాశ్ దీప్. 

రెండో టెస్టుకు గాయాల కారణంగా దూరమైన జడేజా, కేఎల్ రాహుల్ లకు షరతులతో జట్టులో చోటు కల్పించారు. మెడికల్ టీమ్ నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తేనే వారిని తుది జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.


More Telugu News