టీఎస్ కేబినెట్ సమావేశం ప్రారంభం

  • ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
  • మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మల్లు భట్టి
  • ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి  మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. గత ఏడాది అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.


More Telugu News