వాలంటీర్లు వైసీపీకి విధేయులుగా ఉండాలి: ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్
- పరిగి, రొద్దం మండల కేంద్రాల్లో వాలంటీర్లు, వెలుగు, ఇతర సిబ్బందితో మంత్రి సమావేశం
- ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచన
- ఓటర్లు వైసీపీ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని దిశానిర్దేశం
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామ వాలంటీర్లు, ఉపాధి హామీ, వెలుగు సిబ్బంది, యానిమేటర్లు కృషి చేయాల్సిందేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్ అన్నారు. శుక్రవారం మంత్రి శ్రీసత్యసాయి జిల్లా పరిగి, రొద్దం మండల కేంద్రాల్లో వలంటీర్లు, వెలుగు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, సర్పంచులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు వైసీపీ వైపు ఆకర్షితులయ్యేలా కృషి చేయాలన్నారు. మంత్రి మాట్లాడుతుండగా కొందరు పార్టీ నేతలు, వాలంటీర్లు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా మీ బుర్రలో సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవాలని, అందరూ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలని కోరారు.