తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాల విడుదల

  • 7,26,837 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా ప్రకటన
  • https://www.tspsc.gov.in/ ద్వారా ర్యాంకులు చూసుకోవచ్చునని వెల్లడి
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి త్వరలో ప్రకటన ఉంటుందన్న టీఎస్‌పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేడు టీఎస్‌పీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను వెల్లడించింది. 7,26,837 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్  https://www.tspsc.gov.in/ ద్వారా ర్యాంకులు చూసుకోవచ్చునని తెలిపింది.

ఈ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి త్వరలో ప్రకటన విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 

గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి గత ఏడాది జులై 1న ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.


More Telugu News