34 ఏళ్ల తర్వాత రజనీకాంత్ 'లాల్ సలామ్' చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించిన జీవిత
- 1990లో రాజశేఖర్ హీరోగా వచ్చిన మగాడు చిత్రం
- చివరిసారిగా మగాడు చిత్రంలో నటించిన జీవిత
- మళ్లీ ఇన్నాళ్లకు కెమెరా ముందుకొచ్చిన వైనం
ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై కనిపించారు. రజనీకాంత్ ముఖ్యపాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'లాల్ సలామ్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జీవిత కూడా నటించారు. 1990లో జీవిత తన భర్త రాజశేఖర్ హీరోగా వచ్చిన 'మగాడు' చిత్రంలో చివరిసారిగా నటించారు. మళ్లీ 34 ఏళ్ల తర్వాత 'లాల్ సలామ్' చిత్రంతో కెమెరా ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో జీవిత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బహుభాషా చిత్రంలో జీవిత పాత్రకు తమిళంలో సరిత డబ్బింగ్ చెప్పారు. దుబాయ్ లో ఉంటున్న సరిత అక్కడ్నించే డబ్బింగ్ చెప్పడం విశేషం.