ఇటీవల కాలంలో అత్యుత్తమ వార్త ఇదే: పీవీకి 'భారతరత్న'పై నారా లోకేశ్ స్పందన
- పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం
- తెలుగు ప్రజలకు నిజమైన గౌరవం దక్కిందన్న నారా లోకేశ్
- పీవీ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారని కితాబు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
ఇటీవల కాలంలో అత్యుత్తమ వార్త ఏదైనా ఉందంటే అది పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడమేనని పేర్కొన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో తెలుగు ప్రజలకు నిజమైన గౌరవం దక్కినట్టయిందని తెలిపారు.
తన సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసిన ఘనత పీవీకే దక్కుతుందని లోకేశ్ స్పష్టం చేశారు. ఇవాళ ప్రపంచవేదికపై భారత్ ఓ ఆర్థిక పవర్ హౌస్ లాగా నిలబడడానికి నాడు పీవీ రెట్టింపు కృషి చేశారని కొనియాడారు.
కోట్లాది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చిన మహోన్నత నేతకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.