టీఎస్ శాసనమండలిలో గందరగోళం.. రేవంత్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు

  • శాసనమండలి సభ్యులపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న బీఆర్ఎస్ సభ్యులు
  • పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేసిన వైనం
  • అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత వాయిదా తీర్మానం
తెలంగాణ శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. శాసనమండలి సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని... వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సభ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి సభ్యుల గురించి అగౌరవంగా మాట్లాడటం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను శాసనమండలి చైర్మన్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపామని మండలి ఛైర్మన్ తెలిపారు. మరోవైపు, శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. 


More Telugu News