వీరు కదా అసలైన హీరోలు! రైలుకింద చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు రైలును నెట్టిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- నవీముంబైలోని వాషి స్టేషన్‌లో ఘటన
- ప్రయాణికులందరూ దిగి రైలు కోచ్ ను నెట్టిన వైనం
- సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం
- సమష్టి కృషికి నిలువెత్తు నిదర్శనమని ప్రశంసలు
ప్లాట్ ఫామ్ పైనుంచి జారి.. లోకల్ ట్రైన్ కింద పడిన ఓ వ్యక్తిని కాపాడేందుకు ప్రయాణికులందరూ కలిసి రైలు కోచ్ ను నెట్టిన ఘటన నవీ ముంబైలోని వాషి స్టేషన్‌లో జరిగింది. అక్కడే ఉన్న వ్యక్తి ఒకరు ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఆ వ్యక్తిని కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా తలో చేయి వేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు రైలు కోచ్ ను ముందుకు నెట్టడం సామాన్యమైన విషయం కాదంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అందరూ కలిసి చివరికి రైలుకింద చిక్కుకున్న వ్యక్తిని కాపాడి శభాష్ అనిపించుకున్నారు.
బాధితుడు కొద్దిపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘వెల్ డన్ గైస్’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘మీరందరూ హీరోలే’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఐకమత్యంతో చేసే సమష్టి కృషికి ఇది నిదర్శనమని కొందరు, స్ఫూర్తిదాయకమని ఇంకొందరు కామెంట్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.