ఫేస్‌బుక్ లైవ్‌లో శివసేన యూబీటీ నేత కుమారుడి హత్య!
- ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఘటన
- శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్‌ను తన కార్యాలయానికి రప్పించి నిందితుడి దారుణం
- ఓ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య
- అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ నాయకుడి కుమారుడు అభిషేక్ ఘోసాల్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించిన నిందితుడు మారిస్ నోరాన్హా ఘోసాల్కర్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఎమ్‌హెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతడికి విభేదాలు ఉండేవి. ఇటీవలే వారు రాజీ పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో మారిస్, అభిషేక్‌ను ఫైస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించాడు. లైమ్ స్ట్రీమ్ సందర్భంగా మారిస్ ఈ దారుణానికి తెగబడ్డాడు.
ఇటీవలే ఏక్‌నాథ్ శిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు తెగబడిన ఘటన వైరల్‌గా మారింది. ఈ కలకలం సద్దుమణగక ముందే అభిషేక్ హత్య జరగడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి, ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణాలు ఇంకెన్ని రోజులు భరించాలని ప్రశ్నించారు. హింస ప్రజ్వరిల్లితే పరిశ్రమలు రాష్ట్రానికి రావని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు.