ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏర్పడేందుకు చాలా అవకాశాలున్నాయి: సుజనా చౌదరి
- ఏపీలో పొత్తుపెట్టుకున్న టీడీపీ-జనసేన
- జనసేన, బీజేపీ మధ్య ఇప్పటికే భాగస్వామ్యం
- ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలుస్తుందని భావిస్తున్నామన్న సుజనా
ఏపీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉంది. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోగా... జనసేన-బీజేపీ ఎప్పట్నించో భాగస్వాములుగా ఉన్నాయి. కానీ, టీడీపీ-బీజేపీ మధ్య ఇప్పటిదాకా పొత్తుపై ఎలాంటి స్పష్టత లేదు. టీడీపీ, బీజేపీకి ఉమ్మడి మిత్రుడిగా జనసేన ఉన్నప్పటికీ... టీడీపీ, బీజేపీ మధ్యన ఇంకా పొత్తు కుదరాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో, బీజేపీ నేత సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏర్పడేందుకు చాలా అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఏపీలో 2014 నాటి పొత్తులు మళ్లీ వికసిస్తాయని, ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి పోటీ చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలో బీజేపీ కూడా జనసేన-టీడీపీ పొత్తులో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసమే చంద్రబాబు కూడా అమిత్ షాను కలిశారని సుజనా చౌదరి వెల్లడించారు.