హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు: రంగంలోకి ఈడీ
- శివబాలకృష్ణపై నమోదైన ఎఫ్ఐఆర్, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఇవ్వాలని ఏసీబీని కోరిన ఈడీ
- ప్రభుత్వ లెక్కల ప్రకారం శివబాలకృష్ణ ఆస్తుల విలువ రూ.13 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా
- బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందన్న ఏసీబీ
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌తో పాటు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ అధికారులు కోరారు. ఏసీబీ వివరాలు అందించిన అనంతరం ఈడీ దర్యాఫ్తు చేపట్టనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం శివబాలకృష్ణ ఆస్తులు రూ.13 కోట్లుగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. ఏసీబీ ఆయనను ఎనిమిది రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది.
శివబాలకృష్ణ తన అక్రమ ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్లుగా ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ, అతని కుటుంబ సభ్యులు, బినామీల పేరు మీద 214 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. పలు రియాల్టీ సంస్థలకు బాలకృష్ణ మంజూరు చేసిన అనుమతులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇదే సమయంలో ఈడీ రంగంలోకి దిగింది.