యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను దిగజార్చింది: నిర్మలా సీతారామన్

  • పార్లమెంటులో దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • పదేళ్ల ఎన్డీయే పాలనలో వచ్చిన మార్పులపై శ్వేతపత్రం   
  • రేపు పార్లమెంటులో చర్చ
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంటులో నేడు శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. పదేళ్ల ఎన్డీయే పాలనలో వచ్చిన మార్పులను ఈ శ్వేతపత్రంలో పొందుపరిచారు.  దీనిపై రేపు చర్చ జరగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను దిగజార్చిందని విమర్శించారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోయాయని ఆరోపించారు. బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడిందని నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. 

యూపీఏ ప్రభుత్వం 2004లో సంస్కరణలను వదిలేసిందని అన్నారు. యూపీఏ హయాంలో రుణాలపై అధికంగా ఆధారపడ్డారని, సంక్షేమ పథకాలకు నిధులు సరిగా వినియోగింలేదని తెలిపారు.


More Telugu News