ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నాను: లక్ష్మీనారాయణ

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద ధర్నా
  • రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
  • హాజరైన పలువురు నేతలు
జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ అంశాలపై స్పందించారు. రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనిపై లక్ష్మీనారాయణ ఇవాళ ట్వీట్ చేశారు. 

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో తాను కూడా పాల్గొన్నానని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల డిమాండ్ ల అమలుకు చర్యలు తీసుకునేలా గవర్నర్ ను డిమాండ్ చేస్తున్నామని, ఆ మేరకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులోనూ పాల్గొన్నానని లక్ష్మీనారాయణ వివరించారు. 

కాగా, ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో చలసాని శ్రీనివాస్, సీపీఐ రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి శ్రీనివాసరావు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మద్దతు పలికారు.


More Telugu News