ఇండస్ట్రీలో నిలబడాలంటే టాలెంట్ ఉండాల్సిందే: నటి శివపార్వతి
- అమ్మ పాత్రలతో మెప్పించే శివపార్వతి
- ఇండస్ట్రీలో అవకాశాల గురించిన ప్రస్తావన
- టాలెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని వ్యాఖ్య
- అలాంటివారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని వెల్లడి
శివపార్వతి .. టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తరువాత సినిమాలలోను కొన్ని గుర్తుంచుకోదగిన పాత్రలను చేశారు. ముఖ్యంగా తల్లి పాత్రలలో ఆమె ఎక్కువగా మెప్పించారు. తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
"ఇక్కడ త్వరగా అవకాశాలను సంపాదించుకోవాలి .. ఒక్క రాత్రిలోనే ఆకాశానికి ఎదిగిపోవాలనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. అలాంటిదారిలో వెళ్లడం వలన, ఆశించిన ఫలితం దక్కే అవకాశమే లేదనే విషయాన్ని గ్రహించాలి. టాలెంట్ ఉన్నవారిని మాత్రమే ఆడియన్స్ ఆదరిస్తారు. అలాంటివారు మాత్రమే ఇక్కడ నిలబడతారు .. పైకి ఎదుగుతారు" అని అన్నారు.
"ఎవరికి వారు .. తాము ఎంచుకున్న రంగానికి తగిన టాలెంట్ తమ దగ్గర ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి .. ఆ తరువాత ప్రయత్నించాలి. అంతేగానీ ఇండస్ట్రీకి వెళితే ఏదో జరిగిపోతుందనే భయంతో ఇంట్లో కూర్చోవడం కూడా కరెక్టు కాదు. టాలెంటు అనేది ఉంటే ఒకరుకాకపోతే ఒకరు ఛాన్స్ ఇస్తారు. టాలెంట్ అనేది ఉంటే ఈ రోజున కాకపోతే రేపు అవకాశం వస్తుంది" అంటూ చెప్పారు.