ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్న 'భామాకలాపం 2'

  • ప్రియమణి ప్రధానమైన పాత్రగా 'భామాకలాపం2'
  • కీలకమైన పాత్రలో శరణ్య ప్రదీప్ 
  • ఈ నెల 16వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
  • సంగీతాన్ని సమకూర్చిన ప్రశాంత్ విహారి 

ప్రియమణి ప్రధానమైన పాత్రగా రూపొందిన 'భామాకలాపం 2' కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం 'భామాకలాపం' మొదటి పార్టు. కొంతకాలం క్రితం పెద్దగా అంచనాలు లేకుండానే మొదటిపార్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతసేపూ ఇరుగు పొరుగు వ్యవహారాలపై కన్నేసి కాలక్షేపం చేసే ఒక మహిళ, ఎలాంటి సమస్యలను ఫేస్ చేయవలసి వచ్చిందనేది కథ. 

ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ప్రియమణి - శరణ్య ప్రదీప్ నటన ఫాస్టుగా కనెక్ట్ అయ్యాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సెకండ్ పార్టు ద్వారా తెలుసుకోవలసిందే అంటూ ఫస్టు పార్టును ముగించారు. ఇక ఆ తరువాత కథ ఏమిటనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ చాలా కుతూహలంతో ఉన్నారు. 

ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ ను వదులుతూ ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇటీవల వదిలిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు.


More Telugu News