వరల్డ్ నెం.1 అయ్యాక బుమ్రా తొలి కామెంట్.. ఫ్యాన్స్‌పై విసుర్లు
- వరల్డ్ నెం.1 అయ్యాక తొలి పోస్టుతోనే కలకలం రేపిన బుమ్రా
- నిజమైన మద్దతుకు, పైపై పొగడ్తలకు మధ్య తేడా చెబుతూ పోస్టు
- ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం, ఒకే ఒక్క వీక్షకుడున్న స్టాండ్స్ చిత్రాన్ని షేర్ చేసిన వైనం
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ నెం.1గా నిలిచిన భారత స్పీడ్‌స్టర్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో, టీ20ల్లో గతంలోనే నెం.1గా నిలిచిన బుమ్రా.. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లోనూ తొలి స్థానం దక్కించుకున్నాడు. అయితే, ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న వెంటనే బుమ్రా కొందరు ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చాడు.
నిరంతరం వెన్నంటి ఉండే మద్దతుదారులకు, విజయాల్లో మాత్రమే కనిపించే భజనపరులకూ తేడా చెబుతూ బుమ్రా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. స్టాండ్స్‌లో ఒకే ఒక వ్యక్తి ఉన్న చిత్రం, స్టేడియమంతా జనాలతో నిండిపోయిన చిత్రాన్ని బుమ్రా షేర్ చేశారు. నిజమైన మద్దతుకు, పైపై పొగడ్తలు తేడా ఇలాగే ఉంటుందన్న అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. దీంతో, ఇది వైరల్‌గా మారింది.
ఇక వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్ సహకరించకున్నా బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. 9/91తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. చివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ నెం.1గా నిలిచిన ఐదో ప్లేయర్‌గా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, షకీబ్ అల్ హసన్, విరాట్ కోహ్లీలకు ఈ గుర్తింపు దక్కింది.