అయోధ్య బాల రాముడిని పోలిన వెయ్యేళ్ల నాటి విష్ణు విగ్రహం

  • కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోగల కృష్ణా నదిలో లభ్యం
  • వంతెన నిర్మాణ పనులు చేపడుతుండగా బయటపడ్డ వైనం
  • ఆగమశాస్త్రానికి అనుగుణంగా ఉన్న విగ్రహం చుట్టూ దశావతారాలు
  • విష్ణు విగ్రహంతో పాటూ శివలింగం లభ్యం
కర్ణాటకలో రాయచూర్ జిల్లాలోగల కృష్ణా నదిలో వెయ్యేళ్ల నాటి విష్ణు విగ్రహం బయటపడింది. ఇది అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని పోలి ఉండటం సంచలనంగా మారింది. దేవసుగూరు గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడింది. 

విష్ణు విగ్రహంతో పాటు శివలింగం కూడా లభ్యమైంది. ఇక విష్ణువిగ్రహం చుట్టూ దశావతారాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ విగ్రహానికి అనేక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డా.పద్మజా దేశాయ్ తెలిపారు. నిలుచున్న భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఆగమశాస్త్రాలల్లోని మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని చెప్పారు.


More Telugu News