తెలంగాణ నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన: రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధరరావుకు మంత్రి ఆదేశాలు
- ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో పదకొండేళ్లుగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతోన్న మురళీధరరావు
- కాళేశ్వరం ఈఎన్సీ ఇంఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీసుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు
- మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై ప్రభుత్వం చర్యలు
ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఆదేశించారు. నీటి పారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ఈఎన్సీ ఇంఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరికొంత మంది ఇంజినీర్ల పైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఆ పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు ఇటీవల డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో ఆయన పదకొండేళ్లుగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. 2013లో ఆయన ఈఎన్సీగా రిటైర్ అయ్యారు. నాటి నుంచి ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. ఆయనను పదవి నుంచి తప్పిస్తే కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులలోని అక్రమాలు వెలుగు చూస్తాయనే డిమాండ్లు ఉన్నాయి.