నాటకాలు ఆడటంలో కేసీఆర్‌ను మించిన దిట్టలేడు: మంత్రి జూపల్లి కృష్ణారావు
- కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు ఏమిటి? అని ప్రశ్న
- ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందే కేసీఆర్ అని ఆరోపణ
- కమీషన్ల కోసమే కాళేశ్వరానికి అనుమతులు తెచ్చుకున్నారన్న జూపల్లి
- పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్ జలవివాదాన్ని ముందుకు తెచ్చారన్న మంత్రి
నాటకాలు ఆడటంలో కేసీఆర్‌ను మించిన దిట్టలేడని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నల్గొండలో ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నిర్వహించనున్న నిరసన సభపై జూపల్లి మండిపడ్డారు. కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించిందే కేసీఆర్ అని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓడించి శిక్ష వేసినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. కేసీఆర్ తన పదేళ్ల పాలన సమయంలో పాలమూరు - రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అని నిలదీశారు. కానీ కాళేశ్వరానికి ఆదరాబాదరాగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి మాత్రం అనుమతులు తెచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్ జలవివాదాన్ని ముందుకు తెచ్చారన్నారు.