ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఫైనాన్స్, ఐటీ స్టాకుల్లో లాభాల స్వీకరణ
  • 34 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • ఒక పాయింట్ పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్స్, ఐటీ స్టాకుల్లో ఇన్వెస్టర్లు లాభల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి కారణం. ఆ తర్వాత ఒడిదుడుకుల్లో కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 72,152కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 21,930 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 82.96గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.12%), యాక్సిస్ బ్యాంక్ (1.77%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.69%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.33%), టెక్ మహీంద్రా (-2.31%), ఇన్ఫోసిస్ (-2.06%), టీసీఎస్ (-1.22%), ఎన్టీపీసీ (-1.11%).


More Telugu News