ఏపీలో 6 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  • 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
  • ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • ఏప్రిల్ 7న వెల్లడి కానున్న ఫలితాలు
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.  

ఈ డీఎస్సీ పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు... 2,280 ఎస్జీటీ పోస్టులు... 1,264 టీజీటీ పోస్టులు... 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని బొత్స తెలిపారు. 42 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి కూడా నిర్ణయించామని చెప్పారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడు రకాల మేనేజ్ మెంట్ పాఠశాలల పరిధిలో మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు.


More Telugu News