విడుదలతో వివాదాన్ని సృష్టించిన 'ది కేరళ స్టోరీ' .. జీ 5లో!
- అదా శర్మ ప్రధాన పాత్రను పోషించిన 'ది కేరళ స్టోరీ'
- కేరళలో జరిగిన యథార్థ సంఘటనే కథావస్తువు
- క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 16వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్
'ది కేరళ స్టోరీ' .. క్రితం ఏడాది ఈ సినిమా హాట్ టాపిక్ గా అందరి నోళ్లలో నానింది. ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించిన చర్చలే నడిచాయి. అదా శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మత ... రాజకీయ పరమైన దూమారాన్ని రేకెత్తించింది. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. అంతగా ఈ సినిమాలో ఏముంది? అనే ఆసక్తి కారణంగా ఈ సినిమా మరిన్ని వసూళ్లను సాధించింది.
కేరళలో కొన్నేళ్లుగా వేలమంది యువతులు అదృశ్యమవుతూ ఉంటారు. వాళ్లంతా ఏమై ఉంటారనే ఒక విచారణ మొదలవుతుంది. కనిపించకుండా పోయిన వాళ్లంతా మతం మార్చుకుని .. తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారనే విషయం తేలుతుంది. ఈ అంశాన్ని గురించిన ప్రస్తావనే వివాదానికి కారణమైంది.
అనేక వివాదాల మధ్య అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో రావడానికి రెడీ అవుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, జీ 5లో ఈ నెల 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.