సిద్ధూ జొన్నలగడ్డ.. వైష్ణవీ చైతన్య న్యూ మూవీ టైటిల్ ఇదే!
- సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా మరో ప్రాజెక్టు
- క్రైమ్ కామెడీతో నడిచే లవ్ స్టోరీ
- హీరోయిన్ గా 'బేబి' బ్యూటీ వైష్ణవి చైతన్య
- దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్
సిద్ధూ జొన్నలగడ్డ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా 'డీజే టిల్లు'. ఈ సినిమా యూత్ లోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. యూత్ లో అతని ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసింది. ఆ సినిమా సీక్వెల్ గా రూపొందిన 'టిల్లు స్క్వైర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టాడు.
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ ఒక సినిమా చేస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అది నిజమేనని చెబుతూ ఇటీవలే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది క్రైమ్ కామెడీని టచ్ చేస్తూ సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి 'జాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'బొమ్మరిల్లు' భాస్కర్ మార్కు ప్రకారం ఈ సినిమాలో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను .. ఇటు యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఉంటాయట. కథలోని పాయింట్ .. దాని ట్రీట్మెంట్ కొత్తగా అనిపిస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ వైష్ణవి చైతన్య. 'బేబి' సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఈ సినిమాలోనూ ప్రాధాన్యత కలిగిన పాత్రనే చేస్తోందని సమాచారం.