పని చేయని ఎయిర్‌బ్యాగ్... కారు ధరను రిఫండ్ చేయాలని మారుతీ సుజుకీకి వినియోగదారుల కమిషన్ ఆదేశాలు

  • మూడేళ్ల క్రితం ప్రమాదానికి గురైన సమయంలో పని చేయని ఎయిర్ బ్యాగ్
  • వినియోగదారుల ప్యానెల్‌ను ఆశ్రయించిన కేరళ వ్యక్తి
  • రూ.4,35,854 కారు ధరను ఫిర్యాదుదారుకు రిఫండ్ చేయాలని ఆదేశాలు
  • వ్యాజ్యం ఖర్చు కింద రూ.20,000 చెల్లించాలని కమిషన్ ఆదేశాలు
మూడేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడంతో... దాని ధరను కస్టమర్‌కు తిరిగి చెల్లించాలని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ను కేరళలోని వినియోగదారుల ప్యానెల్ ఆదేశించింది. నార్తర్న్ జిల్లాలోని ఇండియానూర్‌కు చెందిన మహ్మద్ ముస్లియార్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మలప్పురం జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

ఫిర్యాదుదారు వివరాల ప్రకారం... అతను ప్రయాణించిన కారు 30 జూన్ 2021న ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతింది. అందులో ప్రయాణించేవారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్ పని చేయలేదు. అయితే తయారీదారు... ఎయిర్ బ్యాగ్ తెరుచుకోకపోవడం వల్ల గాయాలు తీవ్రంగా అయ్యాయని వినియోగదారుల ప్యానెల్‌ను ఆశ్రయించాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్ పని చేయలేదని మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు.

దీంతో ఫిర్యాదుదారుకు కారు ధర రూ.4,35,854ను రిఫండ్ చేయాలని వినియోగదారుల ప్యానెల్ ఆదేశించింది. అలాగే వ్యాజ్యం ఖర్చు రూ.20,000 కూడా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఒక నెలలోపు తమ ఆదేశాలు అమలు చేయాలని లేదంటే తొమ్మిది శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.


More Telugu News