ఐటీ, టెక్ సూచీల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
  • 455 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 158 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 455 పాయింట్లు లాభపడి 72,186కి చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 21,929 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 3 శాతానికి పైగా, ఐటీ, టెక్, టెలికాం, ఎనర్జీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.05గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.43%), మారుతి (4.06%), టీసీఎస్ (4.05%), విప్రో (3.59%), ఇన్ఫోసిస్ (2.52%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.97%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.84%), ఐటీసీ (-1.52%), కోటక్ బ్యాంక్ (-1.21%), యాక్సిస్ బ్యాంక్ (-1.14%).


More Telugu News