ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ 'ఛలో నల్గొండ' బహిరంగ సభ
- కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీసుకున్న వైఖరిని నిరసిస్తూ బహిరంగ సభ
- ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ
- మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకుంటామన్న కేసీఆర్
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ... కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13 న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా బహిరంగ సభపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీసుకున్న వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభను నల్గొండలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని... నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదని, తెలంగాణ ఉద్యమ కారులదే అని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చినట్లు పేర్కొంది.