పేద విద్యార్థుల అల్పాహారం కోసం మొదటి శాలరీని విరాళంగా ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే

  • రూ.1,50,000 మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • నియోజకవర్గంలోని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే
  • చెక్కును కలెక్టర్‌కు అందించిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల వేతనం మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళంగా ఇచ్చారు. ఈమేరకు లక్షన్నర రూపాయల చెక్కును కలెక్టర్ పమేలా సత్పతికి అందించారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ హస్టల్‌లో చదువుకుని‌ పి.హెచ్.డి. చేశానని తెలిపారు. అందుకే తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి వేతనాన్ని పేద విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు అల్పహారం కొరకు అందిస్తున్నట్లు తెలిపారు. గంగాధర గవర్నమెంట్ కాలేజీ విద్యార్థుల అల్పాహారం కోసం ఇటీవలే ఆయన రూ.30,000 అందించారు. ఇప్పుడు నియోజకవర్గంలోని విద్యార్థుల కోసం నెల వేతనాన్ని అందించారు. భవిష్యత్తులో నిరుపేద విద్యార్థుల చదువుల కోసం అండగా ఉంటానని చెప్పారు.


More Telugu News