3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్

  • కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ పోరుబాట
  • నేతలకు మార్గనిర్దేశం చేయనున్న కేసీఆర్
  • అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించనున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత రావడం గమనార్హం. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. 

ఇక ఈనాటి కేసీఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించనున్నారు.


More Telugu News