300 కోట్ల క్లబ్ లో 'హను మాన్' .. పాయింట్ చిన్నదే అయినా పాన్ ఇండియా హిట్!
- జనవరి 12న విడుదలైన 'హను మాన్'
- నిన్నటితో 25 రోజులు పూర్తిచేసుకున్న సినిమా
- డివోషనల్ టచ్ తో కంటెంట్ ను కనెక్ట్ చేసిన డైరెక్టర్
- రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన కాన్సెప్ట్
ఒక హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఇంతకుముందు ఆ హీరో నుంచి ఏ సినిమా వచ్చింది అనేది చూసుకుని థియేటర్ కి వెళ్లడం ఒకప్పుడు కనిపించేది. ఇప్పుడు అలా కాదు .. ఏ సినిమాకి ఆ సినిమాగానే చూసే ట్రెండ్ వచ్చింది. అంతేకాదు ఫేవరేట్ హీరో సినిమాలను మాత్రమే చూస్తామనే ట్రెండ్ కూడా పోయి, కంటెంట్ బాగున్న సినిమాలను ఆదరించే ట్రెండ్ కొనసాగుతోంది.
అలాంటి ఒక ట్రెండ్ కారణంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు సైతం పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఆ జాబితాలో ఇటీవల చేరిన సినిమానే 'హను మాన్'. హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసిన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హను మాన్' సినిమా చేశాడు. జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి మూడు రోజులకు మించి పట్టలేదు.
అలాంటి ఈ సినిమా నిన్నటితో 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 25 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పాయింట్ చిన్నదే అయినా దానిని ఇంట్రెస్టింగ్ గా చెబితే పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుందనే సత్యాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించిందని చెప్పచ్చు.