ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో పైకి ఎగబాకిన భారత్!
- వైజాగ్ టెస్టు విజయంతో రెండో స్థానానికి భారత్
- 55 పాయింట్లతో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
- మూడోస్థానంలో సౌతాఫ్రికా.. అట్టడుగున శ్రీలంక
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత జట్టు 106 పరుగులతో విజయం సాధించి తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెండో స్థానానికి ఎగబాకింది.
ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు, 3 ఓటములతో 55 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తొలి టెస్టు ఓటమితో కిందికి పడిపోయిన రోహిత్‌శర్మ సేన రెండో టెస్టు విజయంతో మళ్లీ రెండో స్థానానికి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 52.77 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్(50) ఉండగా, పాకిస్థాన్ (36.66) ఆరోస్థానానికి పరిమితమైంది. 33.33 పాయింట్లతో వెస్టిండీస్ ఏడు, 25 పాయింట్లతో ఇంగ్లండ్ 8 స్థానంలో ఉండగా పాయింట్ల ఖాతా తెరవని శ్రీలంక అట్టడుగున ఉంది.