సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు

  • అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక 'ఆస్తా' రైలు
  • జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ
  • రామనామ స్మరణతో మార్మోగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన 'ఆస్తా' ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణలు జెండా ఊపి ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలులో 1,346 మంది అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రత్యేక రైలు అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన సికింద్రాబాద్‌కు చేరుకోనుంది.


More Telugu News