ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ
- కేఆర్ఎంబీకి అప్పగించినట్లు బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్య
- కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్, జగన్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపణ
- మనకు రావాల్సిన జలాలను జగన్ ఏపీకి తీసుకు వెళుతుంటే కేసీఆర్ సహకరించారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రాజెక్టులను మన ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎలా అప్పగించారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేసే చర్యలకు పాల్పడుతోంది' అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. డిసెంబర్ 7వ తేదీన మంత్రులం ప్రమాణ స్వీకారం చేశామని గుర్తు చేశారు.
కేఆర్ఎంబీకి తమ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించినట్లు హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్, జగన్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను జగన్ ఏపీకి తీసుకు వెళుతుంటే కేసీఆర్ సహకరించారన్నారు.