కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితికి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు: శ్రీనివాస్ గౌడ్
- రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న శ్రీనివాస్ గౌడ్
- కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ పాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్య
- బీఆర్ఎస్ హయాంలో అన్ని పథకాలు సమయానికి అందేవన్న మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకు వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు. నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఈ కాంగ్రెస్ పాలన కంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఆసరా లబ్దిదారులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్యహించుకుంటున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితికి ముఖ్యమంత్రి తీసుకు వచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సమర్థవంతంగా అమలు చేశామన్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు సమయానికి పడటంతో రైతులు, ఆసరా లబ్దిదారులు సంతోషంగా ఉండేవారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని విమర్శించారు.