మేం ప్రచారం చేసి ఉంటే జగదీశ్ రెడ్డి 70వేల ఓట్ల తేడాతో ఓడిపోయేవాడు: మంత్రి కోమటిరెడ్డి

  • నల్గొండలో నైతికంగా తాము 12 సీట్లు గెలిచామన్న కోమటిరెడ్డి
  • అవసరం లేకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని విమర్శ
  • కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ హయాంలోనే అన్న మంత్రి
నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒకే సీటు గెలిచిందని... తాము కనుక ప్రచారం చేసి ఉంటే జగదీశ్ రెడ్డి 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయేవాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నైతికంగా ఇక్కడ తాము 12 సీట్లు గెలిచామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఆయన దోచుకున్నారని ఆరోపించారు. అవసరం లేకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని ఆరోపించారు. సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక మూసీనీళ్లు తాగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరవు ఛాయలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. మంత్రిగా జగదీశ్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ఏనాడూ రివ్యూ చేయలేదన్నారు. అసలు మేం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు... అప్పుడే ఎవరితోనో కుమ్మక్కు అవుతామా? అని నిలదీశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ హయాంలోనే అని పేర్కొన్నారు.


More Telugu News