ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం... హైలైట్స్ ఇవిగో!

  • నేటి నుంచి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు
  • శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
  • ప్రభుత్వ పాలనను వివరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. మొదట శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పేదరికాన్ని 11.52 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందని, 2.6 లక్షల మంది వలంటీర్ల సాయంతో ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని గవర్నర్ వివరించారు.

ముఖ్యాంశాలు...

  • నవరత్నాల అమలుతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి
  • రాష్ట్రంలో 35,44,866 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసి హక్కులు కల్పించాం
  • జగనన్న సురక్ష ద్వారా 1 కోటి ధ్రువీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం
  • వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు సాయం
  • రాష్ట్రంలో 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్ల ఆర్థికసాయం
  • వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం ద్వారా 66.34 లక్షల మందికి లబ్ది
  • జనవరి 1 నుంచి రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నాం
  • వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04 కోట్ల సాయం
  • వైఎస్సార్ కాపునేస్తం పథకం ద్వారా రూ.2,029 కోట్లు
  • వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,129 కోట్లు
  • వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్ల కేటాయింపు
  • జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ కు వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం
  • జగనన్న చేదోడు పథకం ద్వారా నాయీబ్రాహ్మణులు, టైలర్లకు, దుకాణదారులకు రూ.10 వేల ఆర్థికసాయం
  • నాన్-డీబీటీ కింద రూ.4.23 లక్షల కోట్ల విలువైన సంక్షేమ ఫలాల అందజేత
  • ఇప్పటివరకు 53.53 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందజేత
  • రైతు భరోసా పథకం ద్వారా రూ.33,300 కోట్ల పంపిణీ
  • ఉచిత పంట బీమా పథకం ద్వారా 7,802 కోట్ల విలువైన క్లెయింలు... 54.75 లక్షల మంది రైతులకు లబ్ది
  • ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను సాకారం చేసే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు
  • రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్ ల ఏర్పాటు
  • గ్రామీణ ప్రాంతాల్లో  1.3 కోట్ల మంది రోగులకు ఇంటి వద్దే సేవలు అందజేత
  • ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్తృతం
  • విద్యా సంస్కరణల్లో దేశంలోనే అగ్రగామిగా ఏపీ రాష్ట్రం
  • పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నాం
  • విద్యారంగం కోసం రూ.73,417 కోట్ల వ్యయం
  • చదువుకునే పిల్లలకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మ ఒడి తీసుకువచ్చాం
  • విద్యార్థులకు రూ.15 వేల చొప్పున అందిస్తున్నాం
  • మన బడి నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు కొత్తరూపు అందించాం
  • ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద... ఈ పథకం కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • జగనన్న విద్యాకానుక కింద రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం
  • రాష్ట్రంలో 8,9వ తరగతి విద్యార్థులకు 9,52,925 ట్యాబ్ లు అందించాం
  • విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నాం
  • ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ విస్తరణ
  • ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ... రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటా
  • ఆక్వా రైతులకు రూ.1.50కే ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తున్నాంఔ
  • జాతీయస్థాయిలో స్థూల చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో అగ్రగామిగా ఏపీ
  • వేటకు వెళ్లిన మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తాం
  • పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 74.01 శాతం పనులు పూర్తి
  • పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్ల చెల్లింపులు
  • అవుకు ప్రాజెక్టు రెండో టన్నెల్ పూర్తి... కుప్పం బ్రాంచి కెనాల్ పనులు పూర్తి
  • 10 టీఎంసీల సామర్థ్యంతో చిత్రావతి ప్రాజెక్టు పూర్తి... రూ.280 కోట్ల వ్యయం
  • గ్రామాల్లో త్రీఫేజ్ నాణ్యతతో 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం
  • రాష్ట్రంలో 9 గంటల ఉచిత విద్యుత్ అందజేత
  • 19.41 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట విద్యుత్ సరఫరా
  • రాష్ట్రంలో రూ.490 కోట్లతో 1,221 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు
  • మరో 30 నెలల్లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం
  • మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ స్థాపన
  • పర్యాటక రంగంలో రూ.3,685 కోట్లతో 7,290 మందికి ఉపాధి 



More Telugu News