పోలీస్ స్టేషన్ సీన్ కి క్లాప్స్ పడుతున్నాయి: అంబాజీపేట విలన్ నితిన్ ప్రసన్న
- ఈ నెల 2న విడుదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'
- కొంతసేపటి క్రితం జరిగిన సక్సెస్ మీట్
- థియేటర్ రెస్పాన్స్ గురించి ప్రస్తావించిన నితిన్ ప్రసన్న
- ఈ సినిమాలో చేయడం తన అదృష్టమని వెల్లడి
- శరణ్య ప్రదీప్ పాత్ర పట్ల ప్రశంసలు
సుహాస్ హీరోగా రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా, ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించాడు. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పిన మేకర్స్, కొంతసేపటి క్రితం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ సినిమాలో విలన్ గా నితిన్ ప్రసన్న నటించాడు. ఆయన మాట్లాడుతూ .. "మలయాళ సినిమా షేడ్స్ కలిగిన ఇలాంటి ఒక సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా రివ్యూలలో ప్రతి పాత్రను గురించి ప్రస్తావించడం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా శరణ్య ప్రదీప్ పోషించిన పద్మ పాత్ర స్క్రీన్ పై ఒక హైప్ ఇచ్చింది" అని అన్నారు.
"ఈ సినిమాలోని పోలీస్ స్టేషన్ సీన్స్ కి మంచి అప్లాజ్ వస్తోంది. నేను పోషించిన విలన్ రోల్ ను కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సుహాస్ నటన చూస్తుంటే .. నేను ఇంకా బాగా చేయాలని అనిపించింది. ఆయనతో కలిసి నటించడం మరిచిపోలేని ఒక అనుభవం. ఇక హీరోయిన్ గా శివాని మేజిక్ చేసిందనేది నా అభిప్రాయం" అని చెప్పారు.