నాలుగు రోజుల్లో 45 శాతం పతనమైన పేటీఎం షేర్లు

  • పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు
  • కుదుపులకు లోనైన పేటీఎం షేరు విలువ
  • ఇవాళ ఒక్క రోజే 10 శాతం మేర పతనం
  • నేడు రూ.438 వద్ద ట్రేడవుతున్న పేటీఎం షేరు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన ఆంక్షలతో పేటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల విలువ భారీగా పతనమైంది. నాలుగు రోజుల్లో 45 శాతం దిగజారింది. ఇవాళ ఒక్కరోజే షేర్ల విలువ 10 శాతం క్షీణించింది.

 యూజర్ల నుంచి ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు స్వీకరించరాదని పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. యూజర్ల అకౌంట్ లు, వ్యాలెట్ లు, ఎన్సీఎంసీ కార్డులు, ఫాస్టాగ్ ల్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్ అప్ లు చేయొద్దని పేటీఎంను ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎం కొన్ని మాండేటరీ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు, పర్యవేక్షణ లోపాలు ఉన్నట్టు ఆడిటింగ్ తేలినందునే ఆర్బీఐ ఈ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. 

ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేరు విలువ కుదుపులకు లోనైంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సంస్థ మార్కెట్ విలువ రూ.20,471 కోట్ల మేర పతనమైంది. ఐదు రోజుల కిందట పేటీఎం షేరు విలువ రూ.760.65 ఉండగా, ఇవాళ అది రూ.438.50కి పడిపోయింది.


More Telugu News