'ఈగల్' సినిమాలో నా లుక్ నాకే తెగ నచ్చేసింది: రవితేజ

  • రవితేజ హీరోగా రూపొందిన 'ఈగల్'
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ మీట్
  • కథను నడిపించేది అనుపమ రోల్ అని వ్యాఖ్య 
  • తన మేకోవర్ కి 3 నెలలు పట్టిందని వెల్లడి 
  • ఫస్టు మూవీ రిలీజ్ లా వెయిట్ చేస్తున్నానని వివరణ

రవితేజ కథానాయకుడిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో 'ఈగల్' సినిమా రూపొందింది. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ మీట్ ను నిర్వహించారు. దర్శక నిర్మాతలు ..  సాంకేతిక నిపుణులతో పాటు, రవితేజ - అనుపమ పరమేశ్వరన్ - కావ్య థాపర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ వేదికపై రవితేజ మాట్లాడుతూ .. " కార్తీక్ ఘట్టమనేని ప్రాణం పెట్టి ఈ సినిమాకి పనిచేశాడు. తప్పకుండా ఈ సినిమాతో తనకి మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అలాగే నవదీప్ పాత్రకి .. అతని నటనకి ఎక్కువ మార్కులు పడతాయి. అనుపమ పరమేశ్వరన్ పాత్రనే ఈ సినిమాను నడిపిస్తుంది. కావ్యథాఫర్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది" అని అన్నారు. 

"ఈ సినిమాలో నా లుక్ నాకే బాగా నచ్చేసింది. ఈ మేకోవర్ కోసం దాదాపు రెండు మూడు నెలల సమయం పట్టింది. నా ఫస్టు సినిమా రిలీజ్ రోజు కోసం ఎలా ఎదురుచూశానో, ఈ సినిమా రిలీజ్ కోసం కూడా అలాగే ఎదురుచూస్తున్నాను. దేవ్ జండ్ సంగీతం ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది .. ఈ సినిమా తరువాత ఆయన బిజీ కావడం ఖాయం" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


More Telugu News